10 March, 2026 | 2:59 AM

మహిళా పోలీసులకు సీఐ సన్మానం

09-03-2026 01:05 AM

రామాయంపేట, మార్చి 8 : ధైర్యం, కర్తవ్యనిబద్ధత, సేవాస్ఫూర్తి కలగలిపిన మహిళా పోలీసుల సేవలను గుర్తిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రామాయంపేట పోలీస్ స్టేషన్లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. స్టేషన్ సీఐ వెంకటరాజా గౌడ్ మహిళా పోలీస్ కానిస్టేబుళ్లను శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ& సమాజంలో శాంతి భద్రతలను కాపాడడంలో మహిళా పోలీసుల పాత్ర అపూర్వమని పేర్కొన్నారు. పగలు రాత్రి తేడా లేకుండా కుటుంబ బాధ్యతలు నిర్వహించడంతో పాటు విధుల్లోనూ సమానంగా నిలబడుతున్న మహిళా సిబ్బంది నిజమైన ధైర్యసాహసాల ప్రతిరూపాలని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొని మహిళా పోలీసులకు అభినందనలు తెలియజేశారు.