8 August, 2026 | 9:09 PM

ప్రశాంత వాతావరణంలో బోనాలు జరుపుకోవాలి

08-08-2026 08:04 PM

సీఐ సుధీర్ కుమార్

జిన్నారం/అమీన్ పూర్: ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం నిర్వహించనున్న బోనాల పండుగను ప్రజలు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సిఐ సుధీర్ కుమార్ కోరారు. బోనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తరఫున అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాము. నిర్వాహకులు మరియు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని కోరుతున్నాము. నిబంధనలకు విరుద్ధంగా డీజేలు వినియోగించి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాము. ప్రజలందరూ పోలీస్ శాఖకు సహకరించి బోనాల పండుగను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని కోరుతున్నాము.