8 August, 2026 | 10:00 PM

జునోనీలో రోడ్డుపై పేరుకుపోయిన చెత్త

08-08-2026 08:56 PM

బేల,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా బేల మండలం జునోని గ్రామంలో పారిశుధ్యం అధ్వానంగా మారింది. గ్రామంలోని రహదారి పక్కన పెద్ద ఎత్తున చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర చెత్త రోడ్డు పక్కనే పడేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాల్సిన అధికారులు, గ్రామ సర్పంచ్ పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చెత్త పేరుకుపోవడంతో దోమలు, ఈగలు పెరిగి ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.