8 August, 2026 | 10:19 PM

జిల్లా బధిరుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

08-08-2026 09:06 PM

మంచిర్యాల క్రైం,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బధిరుల సంఘం నూతన పాలకవర్గాన్ని శనివారం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా తోట ప్రశాంత్, ఉపాధ్యక్షులుగా టి. రాజేశ్వర్, జి. సుమలత, ప్రధాన కార్యదర్శిగా జి. రవికాంత్, సహాయ కార్యదర్శిగా కె. రాకేష్, కోశాధికారిగా కె. రాజ్ కుమార్, కార్యవర్గ సభ్యులుగా కె. తిరుపతి, ఎ. సంతోష్, ఓ. సరిత, ఎస్. సంపత్ కుమార్, షాకిల్ ఖాన్ లు ఎన్నికయ్యారు. ఈ కార్యవర్గ పదవీ కాలం మూడేళ్ల పాటు కొనసాగనుంది.