8 August, 2026 | 11:25 PM

మల్లన్న ఆలయంలో దేవత చిత్రపటాలకు శాస్త్రోక్తంగా ఉత్థారణ పూజ

08-08-2026 09:08 PM

పాల్గొన్న డిప్యూటీ కమిషనర్ శైలజ

మేడిపల్లి,(విజయక్రాంతి): బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని మల్లన్న దేవాలయంలో శనివారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేవతా చిత్రపటాల ఫ్రేముల ఉత్థారణ పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎ. శైలజ, అసిస్టెంట్ ఇంజనీర్ మహేష్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ లతో పాటు పలువురు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు పూర్తయిన అనంతరం దేవతా చిత్రపటాల ఫ్రేములను విడదీశారు. చిత్రపటాలను, ఫ్రేములను వేర్వేరుగా సేకరించి, నిబంధనల ప్రకారం వాటిని తగిన రీతిలో నిమజ్జనం లేదా నిర్వహణ చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు.పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుంటూనే, భక్తుల విశ్వాసాలను, ఆధ్యాత్మిక భావాలను గౌరవిస్తూ మున్సిపల్ అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.