calender_icon.png 3 November, 2025 | 12:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఐటీయు జిల్లా మహాసభలు జయప్రదం చేయాలి

02-11-2025 06:23:01 PM

సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్..

లక్షేట్టిపేట (విజయక్రాంతి): సీఐటీయు ఆధ్వర్యంలో ఈనెల నవంబర్ 15, 16న జరిగే సీఐటీయు 3వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ అన్నారు. ఆదివారం స్థానిక ఐబీ ఆవరణలో నిర్వహించిన సీఐటీయు మండల కన్వినింగ్ కమిటీ సమావేశంలో కరపత్రాలు విడుదల చేసి మాట్లాడారు. ఈ సందర్బంగా సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. రాష్టంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు కార్మికులకు వేతనాలు పెంచుతామాని, ప్రతి నెల వేతనాలు చెల్లిస్తామని, పెన్షన్ సౌకర్యలు కల్పిస్తామని అనేక హామీలు ఇచ్చిందన్నారు. నేటికీ ఒక సం. గడిచిన రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు మాత్రం అమలు చేయక నెలలు గడిచిన కార్మికులకు వేతనాలు రాకపోవడంతో కార్మికులు పస్తులుండి పనులు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో లచ్చవ్వ, శంకరవ్వ, సునీత సాగర్, రాజలింగు, రాజన్న తదితరులు పాల్గొన్నారు.