2 June, 2026 | 12:47 PM

Breaking News

ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్   •   గ్రామ యువత ఆలం రాహుల్ ని ఆదర్శంగా తీసుకోవాలి   •   సీఎం రేవంత్ రెడ్డిపై కోవ లక్ష్మి ఫైర్   •   సఫాయి కార్మికులకు ఘన సన్మానం..   •   పవన్ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. హైకోర్టులో జనసేన రిట్ పిటిషన్   •   అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు   •   పదవీత్యాగాలకే కాదు.. ప్రాణత్యాగానికీ వెనుదీయని నేత కేసీఆర్   •   బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   సుప్రీంకోర్టులో ఐదుగురు నూతన న్యాయమూర్తుల ప్రమాణం   •   తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాన్ని సహించేది లేదు   •  

పదవీత్యాగాలకే కాదు.. ప్రాణత్యాగానికీ వెనుదీయని నేత కేసీఆర్

02-06-2026 11:51 AM

దశాబ్దాల పోరాటం ఫలించిన రోజే జూన్ 2

జూన్ 2 కేసీఆర్ జీవితచరిత్రలో అతిపెద్దది

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు(Telangana State Formation Day Celebrations) జరిగాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR), బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు పార్టీ కార్యాలయ ఆవరణలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అమరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో పలువురు తెలంగాణ కళాకారులకు(Artists of Telangana) సన్మానం చేసి, కేసీఆర్ పై, తెలంగాణపై రూపొందించిన పలు పాటలను కేటీఆర్ ఆవిష్కరించారు.

అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ మీద సినిమా తీయాలని అనుకుంటున్నా అని ప్రముఖ దర్శకుడు అడిగారని కేటీఆర్ వెల్లడించారు. కాళేశ్వరం నిర్మాణం పూర్తయ్యాక తీద్దామని కేసీఆర్ అన్నారు. జూన్ 2వ తేదీ కేసీఆర్ జీవితచరిత్రలో అతిపెద్దదని కేటీఆర్ వెల్లడించారు. దశాబద్దాల పోరాటం ఫలించిన రోజే జూన్ 2 అన్నారు. తెలంగాణ కోసం ఎత్తిన జెండా దింపేది లేదని కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) చెప్పారని గుర్తుచేశారు. పోరాటం మధ్యలో ఆపితే.. రాళ్లతో కొట్టాలని కేసీఆర్ ధైర్యంగా చెప్పారని పేర్కొన్నారు. పదవీత్యాగాలకే కాదు.. ప్రాణత్యాగానికీ వెనుదీయని నేత కేసీఆర్ అన్నారు. 14 ఏళ్లు పోరాడి రాష్ట్రం సిద్ధించాక కేసీఆర్ చేతిలో ప్రజలు బాధ్యతలు పెట్టారన్నారు. పోరాట నాయకుడే పాలకుడైతే బాగుంటుందని ప్రజలు భావించారని తెలిపారు.