calender_icon.png 3 November, 2025 | 12:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలితమే.. మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు

02-11-2025 06:20:21 PM

అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నత్తి మైసయ్య

బోడుప్పల్ లో 350వ వారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు జ్ఞానమాల

ముఖ్య అతిథులుగా మాజీ డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్

మేడిపల్లి (విజయక్రాంతి): బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి 350వ ఆదివారం జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్, మాజీ ఎంపిటిసి నత్తి జంగమ్మ పాల్గొని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా స్రవంతి కిషోర్ గౌడ్ మాట్లాడుతూ తన జీవితాన్ని త్యాగం చేసి భారతీయులకు అత్యున్నత రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని, ఆయన ఆశయాలు ఆకాంక్షల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, విజయవంతంగా 350 వారాలుగా జ్ఞానమాల నిర్వహిస్తున్న అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం నత్తి మైసయ్య మాట్లాడుతూ ఆడ, మగ అనే తేడా లేకుండా పుట్టింట్లో కూడా ఆడబిడ్డలకు సమాన హక్కులు కల్పించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని, ఆయన కల్పించిన రాజ్యాంగ సమాన హక్కుల ఫలితంగానే నేడు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో మహిళలు రాణిస్తున్నారని మైసయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో భూ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుగ్గ మైసయ్య, బహుజన ఉపాధ్యాయ సంఘం స్టేట్ సెక్రెటరీ ఇటుకల రవీందర్, గరుగుల యాకయ్య, సగ్గు నరసింహ, వై శ్రీనివాస్, బండారి సాయి, జడ శ్రీనివాస్, ఏ రాజేష్, యేసు రాజు, బెక్కం శివ, కంచి సతీష్ తదితరులు పాల్గొన్నారు.