కార్మికుల అసంఘటిత రంగాల కార్మికులకు సిఐటియు అండదండ
కొండాపూర్: సిఐటియు 56వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సిఐటియు కొండాపూర్ ఆఫీస్ ముందు జెండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మండల నాయకులు కె రాజయ్య మాట్లాడుతూ సిఐటియు ఆవిర్భవించి 56 సంవత్సరములు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయా గ్రామాలలో సిఐటి జెండాలు ఎగురవేయడం కార్మికులు కష్టపడి పని చేసుకుని తమ హక్కులను సాధించే పోరాటంలో సిఐటియు అండదండలుగా ఉండి గత 56 సంవత్సరములుగా కార్మికులకు అసంఘటిత రంగాలలో పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరికి వారి వారి హక్కుల కోసం కొన్ని దశాబ్దాలుగా పోరాటాలు నిర్వహిస్తూ కార్మికులకు అండదండలుగా నిలబడింది సిఐటియు ఎర్ర జెండా కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని అలాగే కార్మికులకు ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని అలాగే కార్మిక చట్టాలను మారుస్తూ నాలుగు లేబర్ కోడలుగా తీసుకువచ్చింది లేబర్ కోళ్ల వల్ల కార్మికులకు అన్యాయం జరుగుతుందని కాబట్టి నాలుగు లేబర్ కోళ్ల రద్దు చేయాలని పోరాటంలో సిఐటియు ముందడుగులో ఉందన్నారు. భవిష్యత్తులో కార్మిక వర్గానికి అన్యాయం చేస్తే అందరము కలిసికట్టుగా పోరాటాలు చేసి మన హక్కులను మనం సాధించేవరకు ఈ పోరాటం చేయక తప్పదు అన్నారు.






