calender_icon.png 10 October, 2025 | 8:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీసీసీ రాజధానిగా నగరం

10-10-2025 12:22:44 AM

  1. బీఆర్‌ఎస్ ప్రభుత్వ కృషితోనే హైదరాబాద్‌కు ఈ ఘనత
  2. కంపెనీల ఏర్పాటుకు సులభతర విధానం తీసుకొచ్చాం
  3. తద్వారా వ్యాపార, వాణిజ్య, పెట్టుబడి రంగాల్లో అగ్రస్థానం
  4. జీసీసీ సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): దేశంలోనే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ)కు రాజధానిగా హైదరాబాద్ నగరం మారిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో జరిగిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇం డియా కేపబిలిటీ సెంటర్ సమ్మిట్ (జీసీసీ)కు ముఖ్య అతిథిగా పాల్గొని కేటీఆర్ ప్రసంగించారు.

జీసీసీల జాబితాలో ప్రస్తు తం రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ త్వరలోనే మొదటి స్థానానికి వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. హైదరాబాద్ నగరం బెంగళూరును దాటి మరింత ప్రగతి సాధించాలని కోరుకున్నారు. ప్రస్తుతం హైదరా బాద్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు రాజధానిగా మారడం వెనుక గత ప్రభుత్వ కృషి ఎంతగానో ఉన్నదని గుర్తుచేశారు. పదేండ్లపాటు అన్ని రంగాల్లో, అన్ని కోణాల్లో హైదరాబాద్ నగరాన్ని సమగ్రంగా తీర్చిదిద్దడం వల్లే ఇది సాధ్యమవుతోందన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు వ్యక్తుల ఆధారంగా కాకుండా శాశ్వతంగా మంచి ఫలితా లు వచ్చేలా వ్యవస్థలను, చట్టాలను, సంస్కరణలను తీసుకురావడం వల్ల తెలంగాణ వ్యాపార, వాణిజ్య, పెట్టుబడి రంగాల్లో అగ్రస్థానంలో నిలిచిందని స్పష్టంచేశారు. తెలం గాణలో కంపెనీల ఏర్పాటుకు సులభతరమైన విధానం తీసుకొచ్చామని గుర్తుచేశారు. అందుకే బ్యాంకింగ్, ఫార్మా, హెల్త్ కేర్, ఐటీ రంగాల్లో భారీగా పెట్టుబడులను, అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించగలిగిందని తెలిపారు.

హైదరాబాద్‌లో అనేక అవకాశాలు ఉన్నాయని, వీటన్నింటినీ ఉపయో గించుకొని మరింత పెట్టుబడులు వచ్చేలా తమ తమ పరిధిలో కృషి చేయాలని చార్టెడ్ అకౌంటెంట్లకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఉన్న సంస్కరణల యుగంలో ఆర్థిక కార్యకలాపాలపైన కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు తీసుకువస్తున్న చట్టాల నేపథ్యంలో చార్టెడ్ అకౌంటెంట్ల ప్రాధాన్యత బాగా పెరిగిందని, వీరంతా దేశంలో డిజిటల్ ఫైనాన్షియల్ ఎకో సిస్టముకు సంబంధించిన రంగంలో కీలకంగా మారారని తెలిపారు. ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రావాలని ఎల్లప్పుడూ కోరుకుంటా మని, ఈ దిశగా రాష్ర్ట ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తిచేశారు.