28 June, 2026 | 3:47 PM

Breaking News

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •  

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. చదువును ఆపొద్దు

28-02-2026 02:55 AM

విద్యార్థినులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉద్బోధ 

కోటగల్లి బాలికల పాఠశాలలో పునర్వినియోగ సానిటరీ ప్యాడ్లు పంపిణీ 

నిజామాబాద్, ఫిబ్రవరి 27(విజయక్రాంతి): ఎన్ని ఇబ్బందులు ఎదురైనా...చదువును అర్ధాంతరంగా ఆపొద్దని, ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో చక్కగా స్థిరపడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థినులకు ఉద్బోధ చేశారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు కలెక్టర్ చేతుల మీదుగా శుక్రవారం పునర్వినియోగ సానిటరీ ప్యాడ్లు పంపిణీ చేశారు.

రోటరీ క్లబ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు సంయుక్తంగా 60 వేల పునర్వినియోగ సానిటరీ ప్యాడ్లను బాలికలకు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకు న్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం కోటగల్లి బాలికల పాఠశాలలో 650 మంది బాలికలకు సానిటరీ ప్యాడ్లు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, ఈ ప్యాడ్లను ఏడాది కాలం పాటు పునర్వినియోగం చేసుకోవచ్చని, వీటిని వాడిన అనతరం శుభ్రపర్చుకుని చక్కగా ఆరబెట్టుకుంటే, తిరిగి వాటినే వినియోగించుకోవచ్చని సూచించారు.

నెలసరి విషయంలో బాలికలు ఆందోళనకు లోను కావద్దని, మహిళలకు ఇది ప్రకృతి సహజంగా జరిగే పరిణామమని అన్నారు. హార్మోన్ల సమతుల్యత లోపిస్తే వైద్య పరీక్షలు జరిపించుకోవాలని సూచించారు. బాలికలు వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ, ఆరోగ్యాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాల న్నారు. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని, బలవర్ధకమైన ఆహార పదార్థాలు తీసుకోవాలని అన్నారు. విద్యతోనే సమాజంలో ఉన్నత స్థానం, గౌరవం లభిస్తుందని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా విద్యార్జనను కొనసాగించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్.బీ.ఐ రీజినల్ మేనేజర్ మహేశ్వరం, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ సునీల్, పాఠశాల హెచ్.ఎం సాయరెడ్డి, ఎస్.బీ.ఐ, రోటరీ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.