17 April, 2026 | 1:47 PM

Breaking News

నిధులు మంజూరైనా.. ప్రారంభం కాని పనులు

28-02-2026 12:00 AM

వర్షాకాలంలోగా వాగులపై వంతెనల నిర్మాణం జరిగేనా?

రాకపోకలకు మారుమూల ప్రాంతాల ప్రజల ఇబ్బందులు

ఉట్నూర్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి):  దేవుడు వరమిచ్చిన... పూజారి కరుణించని చందంగా మారింది జిల్లాలోని ఏజెన్సీలోని వివిధ మండలాల్లోని మారుమూల గ్రామాల గిరిజనుల పరిస్థితి... గత ప్రభుత్వం మారుమూల గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యంతో పాటు వాగులపై కల్వర్టులు నిర్మించేందుకు కోట్లాది రూపాయలను మంజూ రు చేసింది. గత ప్రభుత్వం మంజూ రు చేసిన నిధులకు అప్పటి ప్రభుత్వం టెండర్లు పిలిచి గుత్తేకారులకు పనులు అప్పగించి మూడేళ్లు దాటిన నేటికీ ఎక్కడి పను లు అక్కడినే నిలిచిపోయి దర్శనమిస్తున్నాయి.

తమ గ్రామాలకు కల్వర్టులు, రోడ్ల నిర్మాణానికి ప్రభు త్వం మంజూరు చేసిన నిధులతో పనులు ప్రారంభించాలని అధికారులకు, పాలకులకు ప్రజలు విన్న వించిన పట్టించుకునే నాధుడు లేరని గిరిజనులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఐటీడీఏ, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకొని మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యంతో పాటు వాగులపై వంతెనల నిర్మాణాలు ప్రారంభించి వచ్చే వర్షాకాలంలోగా పూర్తిచేయా లని గిరిజనులు కోరుతున్నారు.

ఇంద్రవెల్లి మండలంలోని హర్కాపూర్ పంచాయితీ పరిధిలోకి వచ్చే మామిడి గూడ గ్రామానికి తారు రోడ్డుకు రూ. 70 లక్షలు, వాగుపై వంతెన నిర్మాణానికి రూ. 3.50 కోట్లను గత ప్రభుత్వం మంజూరు చేసింది. తారు రోడ్డు పనులను తీసుకున్న గుత్తేదారు కొంత పని చేసి మధ్యలో వదిలేశారు. వంతెన నిర్మాణం పనులకు నేటికీ శ్రీకారం చుట్టలేదు. 

వాగులతో ఇబ్బందులు..

ఇంద్రవెల్లి మండలం గౌరవపూర్ పంచాయతీ పరిధిలోని చిత్తబట్ట గ్రామానికి తార్ రోడ్డుతో పాటు వంతెన నిర్మాణానికి 2021-22 లో గత ప్రభుత్వం రూ. 3.20 కోట్లు మంజూరు చేసింది. పనులు తీసుకున్న గుత్తేదార్ పనులు ప్రారంభించడం లేదు. ఇప్పటికైనా పనులు ప్రారంభించి వంతెన పనులు పూర్తి చిత్తబట్ట గిరిజనులు కోరుతున్నారు. ఆదిలాబాద్ గ్రామీణ మం డలంలోని అత్తిగుట్టతో పాటు పలు పంచాయ తీల ప్రజలు నిత్యం ఇంద్రవెల్లి మండల కేంద్రానికి రాకపోకలు సాగిస్తారు. మధ్య లో వాగు ఉండడం వల్ల అక్కడి గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు.

ఉట్నూర్ మం డలంలోని వంక తుమ్మ, నర్సాపూర్ (జె), తదితర గ్రామాలకు వెళ్లేందుకు వాగులు, వంకలు ఉన్నా యి. వాగులపై వంతెన నిర్మాణాలకు నిధులు మంజూరైన నేటికీ పనులు ప్రారంభం కాలేదు. నార్నూర్, గాదిగూడ మండలాల్లోని మారుమూల గ్రామా లకు గిరిజన రాకపోకలు సాగించేందుకు వాగులు అడ్డంగా ఉన్నాయి. ఈ వాగులపై కల్వర్టులు నిర్మించేందుకు నిధులు మంజూరైన నేటికీ పనులు ప్రారంభం కాలేదు