28 February, 2026 | 4:24 AM

పంచాయతీలకు నిధులొచ్చాయ్

28-02-2026 01:37 AM
  1. మెదక్ జిల్లాలో 492 గ్రామ పంచాయతీలు... 

15వ ఆర్థిక సంఘం నిధులు రూ.20 కోట్ల 92 లక్షలు

పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు 

మెదక్, ఫిబ్రవరి 27 (విజయ క్రాంతి) :గ్రామ పంచాయతీల్లో ఇటీవల కొత్త పాలక వర్గాలు కొలువుదీరగా..రెండు నెలలోనే కేం ద్ర ప్రభుత్వం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరయ్యాయి. సుమారు రెండే ళ్ల ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న పంచాయతీల్లో పాలన కుంటుపడింది.

దీంతో స మస్యలు పేరుకుపోయాయి. పంచాయతీ కార్యదర్శులు సొంత డబ్బులతో అత్యవసర పనులు చేయించారు. గత డిసెంబరులో రా ష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా మెదక్ జిల్లాకు రూ.20 కోట్ల 92 లక్షలు విడుదల అయ్యాయి.

 పంచాయతీ ఖాతాల్లో నిధులు.. 

పంచాయతీ ఖాతాల్లో ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను జమ చేసింది. జిల్లాలోని 492 పంచాయతీలకు సుమారు రూ.21 కో ట్లు విడుదల అయ్యాయి. వీటికోసం కొన్ని నెలలుగా పంచాయతీలు ఎదురుచూస్తున్నాయి. పెండింగ్లో ఉన్న బిల్లులకు ఉపయో గించుకోవచ్చని ఆశించాయి. నిధులను ఇష్టారీతిన వెచ్చిస్తే చర్యలు తప్పవంటూ కార్య దర్శులకు హెచ్చరిక చేసింది.

పనులు చేయాలంటే పంచాయతీ కార్యదర్శులు ముందూ వెనుక ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు విద్యుత్ బిల్లులకు కొంత మేర కేటా యించాలని పంచాయతీలకు సూ చించారు. ప్రతి పంచాయతీ తమకు జమ అయిన ఆ ర్థిక సంఘం నిధుల్లో 10 నుంచి 15 శాతం వరకు విద్యుత్ బిల్లులు చెల్లించాలని ప్రభు త్వం స్పష్టం చేసింది. ఆ మేరకు పంచాయతీలు చర్యలు తీసుకున్నాయి.

పారిశుధ్య నిర్వహణకు నిధులు వెచ్చిస్తున్నారు. సిబ్బం ది వేతనాలను మంజూరు చేస్తున్నారు. అంతేకాదు గ్రామ పంచాయతీల్లో అత్యవసర పనులు చేపట్టేందుకు అవకాశం కలిగిం ది. ప్రభుత్వం ఇటీవల పంచాయతీల్లో మౌ లిక సదుపాయాల కల్పన కోసం గ్రామ సభలను నిర్వహించింది. వాటిలో ఉపాధి పథ కం అనుసంధానంతో రోడ్లు, డ్రైనేజీ, పైపులైన్ల నిర్మాణాలు, ఆర్థిక వనరులను పెం చేందుకు అవసరమయ్యే పలు రకాల పనులను అధికారులు ఎంపిక చేశారు. ప్రస్తుతం ఆర్థిక సంఘం నిధులు మంజూరు కావడంతో వాటి ద్వారా ఆయా పనులను సత్వర మే చేపట్టనున్నారు.

మరోవైపు ప్రజలకు తాగునీటి సరఫరా, పారిశుధ్యం మెరుగుతో పాటు పలురకాల పనులు చేపట్టేందుకు దోహదపడనుంది. మేజర్ పంచాయతీలకు మాత్రమే సొంత నిధులున్నాయి. ఆస్తిపన్ను రూపంలో నిధులు జమ అవుతున్నాయి. ఇటీవల జిల్లా పంచాయతీ అధికారులు పంచాయతీల ఆదాయం పెంచేలా వ్యూహ రచన చేశారు.

 పాత బిల్లులకు కొర్రీలు.. పెడుతున్న కొత్త సర్పంచులు.. 

గత సర్పంచులు గ్రామ పంచాయతీల్లో పనులు చేసినా బిల్లుకు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత రెండేళ్లుగా పనులు చేసిన సర్పంచులు బిల్లులు చెల్లించకపోవడంతో వడ్డీలు కట్టలేక తీవ్ర ఇబ్బం దులు పడ్డారు. మెదక్ జిల్లాలోని ఆయా మండలాల సర్పంచులు తాము గ్రామాల్లో చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాలు సమ ర్పించిన సందర్భాలు ఉన్నాయి.

గత డిసెంబర్ లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కొత్త పాలక వర్గాలు కొలువుదీరాయి. దీంతో కేం ద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. అయితే ఇందులో కొత్త స ర్పంచులకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. మాజీ సర్పంచులు గ్రామాల్లో చేసిన పనుల కు బిల్లులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించగా...పాత సర్పంచులకు సంబంధించిన బిల్లుల విషయంలో కొత్త సర్పంచులు కొన్ని చోట్ల కొర్రీలు పెట్టే అవకాశం ఉంది. దీంతో పంచాయతీ కార్యదర్శులు కూడా నలిగిపోయే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా... ఈ నిధులను మార్చి 31వరకు ఉపయోగించుకోవాలని జిల్లా అధికారులు ఆదేశించారు.

నిధులను సద్వినియోగం చేసుకోవాలి

గ్రామ పంచాయతీలకు మంజూరైన 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు అయ్యాయి. మెదక్ జిల్లాలోని 492 గ్రా మ పంచాయతీలకు రూ.20.92 కోట్లు మంజూరు అయ్యాయి. ఈ నిధులను గ్రామాల్లో ముఖ్యంగా తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాల కోసం వినియో గించాలి. ఎక్కడైనా నిధులు పక్కదారి ప డితే చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

 యాదయ్య, డీపీఓ