17 April, 2026 | 2:52 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఇది ప్రభుత్వం కాదు.. రియల్ ఎస్టేట్ కంపెనీ

28-02-2026 02:15 AM
  1. వీళ్లు మంత్రులు కాదు.. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు

గాంధీ కుటుంబానికి రూ.వెయ్యి కోట్లు!

పేదల ఇళ్లు కూల్చి, భూములు అమ్మి డబ్బులు 

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి) : వెయ్యి కోట్ల రూపాయలు గాంధీ కుటుంబానికి పంపుతాను అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రామిస్ చేశారని, అందుకే పేదల ఇళ్లు కూల్చి, భూములు అమ్మి డబ్బులు రెడీ చేయాలని చూస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కేటీఆర్ శుక్రవారం ట్విట్టర్ వేదికగా ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రు లు, ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు.

సీఎం రేవంత్‌రెడ్డి పేదల ఇళ్లు కూలగొడుతూ.. హైదరాబాద్‌లో తన రెండవ ప్యాలెస్ కట్టుకుంటున్నారని, పేదల ఇళ్లు పెకిలించి వేస్తూ... మరో పక్క తన కోటకు తొమ్మిది కోట్లు కేవలము గోడలు కట్టడానికి ఖర్చు చేస్తు న్నారని విమర్శించారు.

భట్టి  విక్రమా ర్క మూడో ఇల్లు కట్టుకుంటున్నారని, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పదవ కంపెనీ పెట్టి కమీషన్లు వెనకేసుకుంటున్నారని ఆరోపించారు. కానీ పేదల జీవితాలను మాత్రం రోడ్డున పడేశారని మండిపడ్డారు. ఇది ప్రభుత్వం కాదు, రియల్ ఎస్టేట్ కంపెనీ అని, వీళ్లు మంత్రులు కాదు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.