31 July, 2026 | 3:58 PM

ప్రతిఒక్కరూ సోదరభావంతో మెలగాలి

31-07-2026 03:16 PM

- హెచ్డబ్ల్యూవో కె.వెంకటేశ్వర్లు

సిద్దిపేట రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో కుల వివక్షకు తావులేకుండా ప్రతిఒక్కరూ సోదరభావంతో మెలగాలని సిద్దిపేట జిల్లా షెడ్యూల్ కులాల వసతి గృహా సంక్షేమ అధికారి కె.వెంకటేశ్వర్లు సూచించారు. నారాయణరావుపేట మండలంలోని మల్యాల గ్రామంలో నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన సమాన హక్కులు, చట్టాల గురించి ప్రజలకు వివరించారు. అంటరానితనం, కుల వివక్షను పూర్తిగా రూపమాపడమే పౌర హక్కుల దినోత్సవ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. పౌర హక్కులపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ అధికారి రాజు, పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.