కోతకు గురైన మర్రిమడ్ల–గర్జనపల్లి రహదారి దుస్థితి
తక్షణ మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తుల డిమాండ్
కోనరావుపేట, జూలై 31 (విజయక్రాంతి): కోనరావుపేట మండలం మర్రిమడ్ల నుంచి గర్జనపల్లి(Marrimadla Garjanapalli road ) వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర సాగుతున్న రహదారి నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం, నాణ్యతా లోపాల కారణంగా రోడ్డు దెబ్బతిని భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, స్థానిక ప్రజలు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రోడ్డు అధ్వాన్నంగా మారడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లు స్పందించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రహదారికి మరమ్మతులు చేపట్టి ప్రజలకు సురక్షిత రాకపోకలు కల్పించాలని గ్రామస్థులు ఆర్‌అండ్‌బీ అధికారులను, కాంట్రాక్టర్లను డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వాతి–శ్రీనివాస్, వార్డు సభ్యులు కుమ్మరి దిలీప్ కుమార్, కొండం రమేష్, జింక రాజేందర్, కొమ్ము రాజేశం తదితరులు పాల్గొన్నారు.






