5 April, 2026 | 8:10 PM

హైకోర్టు నిర్మాణ పనులు చేపడుతున్న ప్రభుత్వానికి అభినందనలు

05-04-2026 01:58 PM

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో నిర్మించే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జోన్-2 భవన(High Court Zone-2 Buildings,) నిర్మాణ పనులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్(Supreme Court Chief Justice Justice Surya Kant) ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ... దాదాపు 23 ఏళ్లు సుదీర్ఘ కాలంగా న్యాయ వ్యవస్థలో పని చేస్తున్నానని, ఇప్పటికే హైకోర్టు జోన్-1 భవన కాంప్టెక్స్ నిర్మాణంలో ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం హైకోర్టు జోన్-2 భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకున్నామని, కోర్టులో జరుగుతున్న ప్రొసీడింగ్స్ అనేవి ప్రజలకు విజిబుల్ జ్యుడీషియరీ అని, కోర్టు గది వెనుక మరో ప్రపంచం ఉంటుందని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు.

జడ్జీల నివాస సముదాయాల్లో కార్యకలాపాలు నడుస్తూనే ఉంటాయని, కోర్టు కార్యకలాపాలు కొనసాగుతూనే ఉంటాయని, హైకోర్టు నిర్మాణ పనులు చేపడుతున్న ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో పాలన కొనసాగుతోందని, జ్యుడీషియరీ వ్యవస్థ నిర్మాణంలో సానుకూల దృక్పథంతో సాగుతున్నారని సీజేఐ వెల్లడించారు. ప్రతి రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు అనేది రాజ్యాంగ బాధ్యత అని, కోర్టు ఏర్పాటు న్యాయ అవసరమే కాదు.. నిబద్ధతతో ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.