25 July, 2026 | 5:26 PM

Breaking News

టిఐసిసిఐ రాష్ట్ర మీడియా, సాంస్కృతిక విభాగ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా రామావత్ నాగేంద్ర నాయక్ నియామకం   •   సర్ ప్రక్రియలో పారదర్శకతకు రాజకీయ పార్టీల సహకారం కీలకం   •   అభివృద్ధి పనులకు నిధులు మంజూరు   •   డిసిసి అధ్యక్షుడుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   కోటగుళ్లలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు   •   బిజెపి యువమోర్చా ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్   •   జిల్లా జన గణన హ్యాండ్ బుక్ ప్రమాణాలకు అతిథంగా తీర్చిదిద్దాలి   •   జాతీయ ఓబీసీ సభలు జయప్రదం చేయండి   •   కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి   •   హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికిన కలెక్టర్   •  

జైనూర్ మేజర్ పంచాయతీలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు

30-05-2026 03:44 PM

సర్పంచ్ కొడప ప్రకాష్ నూతన బోర్‌వెల్‌ల పరిశీలన

జైనురు,(విజయక్రాంతి): కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ కొడప ప్రకాష్ తెలిపారు. పంచాయతీ నిధులతో మోమిన్‌పుర, సోను పటేల్‌గూడలో నూతనంగా వేసిన తాగునీటి బోర్‌వెల్‌లను శనివారం ఆయన పరిశీలించారు.

బోర్‌వెల్‌ల ద్వారా జరుగుతున్న నీటి సరఫరా వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాలనీల్లో ఏదైనా సమస్య ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సర్పంచ్ కొడప ప్రకాష్ ప్రజలకు సూచించారు. పంచాయతీ పరిధిలో ఎలాంటి సమస్యలు తలెత్తినా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు.