30 May, 2026 | 4:04 PM

శిథిలావస్థలో దాసరి నారాయణ రావు సమాధి

30-05-2026 03:27 PM

- ఇంస్టాగ్రామ్లో చూసి సమాధి వద్దకు వచ్చిన సినీ నటుడు మంచు విష్ణు

చేవెళ్ళ,(విజయక్రాంతి): కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత సినీ దర్శక రత్న దాసరి నారాయణ రావు సమాధి శిథిలావస్థకు చేరింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ లో చూసిన సినీ నటుడు మంచు మనోజ్ శనివారం చేవెళ్ళ నియోజకవర్గం మొయినాబాద్ మండలం తొల్కట్ట రెవిన్యూలోని దాసరి సమాధి వద్దుకు చేరుకున్నారు. సమాధి పరిసరాలు చూసిన ఆయన క్లిన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టారు.

విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య హుటా హుటిన అక్కడికి చేరుకుని మంచు మనోజ్ తో మాట్లాడారు. కేంద్ర మాజీ సమాధి ప్రాంతాన్ని త్వరలో శుభ్రం చేయిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే యాదయ్యతో పాటు గుడి మల్కాపూర్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మంగలి యాదగిరి, పడాల ప్రభాకర్,  సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పీసరి సురేందర్, తదితరులు ఉన్నారు.