18 July, 2026 | 4:20 PM

Breaking News

గడ్డన్న సుద్ద వాగు ప్రాజెక్టు సందర్శించిన కలెక్టర్   •   ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు మెరుగుపరచాలి   •   జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో సర్వజ్ఞ స్కూల్ విద్యార్థికి కాంస్య పతకం   •   ప్రియదర్శిని మహిళా ఇంజినీరింగ్ ఆటోనామౌస్ కళాశాలలో యువ నాయకత్వం   •   విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి   •   డీటిబ్ల్యూఓ జాదవ్ అంబాజీకి సన్మానం   •   సోనం వాంగ్చుక్ దీక్షకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు   •   చెట్టును ఢీకొన్న బైక్.. యువకుడు మృతి   •   రామగుండం కమీషనరేట్ లో కోర్టు డ్యూటీ అధికారుల పనితీరు మెరుగుపర్చాలి   •   పట్టణాభివృద్ధికి ప్యాకేజీ ప్రకటించాలి   •  

ఉగ్రకుట్ర భగ్నం.. దావూద్‌తో సంబంధాలున్న తొమ్మిది మంది అరెస్ట్

30-05-2026 03:26 PM
  1. ఉగ్రముఠా అరెస్ట్... ఢిల్లీలో హైఅలర్ట్.. 
  2. 9 మంది అరెస్టు, పాక్ ISIతో సంబంధాలు.
  3. దావూద్ ఇబ్రహీం అనుచరులు
  4. ఢిల్లీ, ముంబైలలో దాడులకు కుట్ర

న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసులు భారీ ఉగ్రకుట్రను(Attacks) భగ్నం చేశారు. దేశవ్యాప్తంగా పలు చోట్లు పేలుళ్లకు కుట్ర పన్నని ఉగ్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కీలక భవనాలు, భద్రతా సిబ్బంది లక్ష్యంగా ముఠా దాడులకు కుట్ర పన్నినట్లు గుర్తించారు. ఐఎస్ ఐతో సంబంధమున్న 9 మందిని ఢిల్లీ పోలీసులు(Delhi Police) అరెస్ట్ చేశారు. ముఠాకు మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీంతో(Dawood Ibrahim) సంబంధాలున్నట్లు గుర్తించారు.

ఉగ్ర నెట్ వర్క్ ప్రధాన సూత్రధారి కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రముఠా అరెస్టు దృష్ట్యా ఢిల్లీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. నిఘా సంస్థల సమాచారం ఆధారంగా పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. ఢిల్లీ, ముంబయి, పంజాబ్ కు చెందిన నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్టు అయిన వారిలో కొందు విదేశీయులూ ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుల నుంచి పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.