14 August, 2026 | 10:11 PM

Breaking News

ఆలయంలో బంగారు ముక్కుపోగుల చోరీ.. నిందితుల అరెస్ట్   •   ఘనంగా తిరంగా యాత్ర ర్యాలీ   •   చిట్యాలలో టీటీడీ కల్యాణ మండపం భూమిపై సమగ్ర విచారణ జరిపించాలి   •   విద్యుత్ ఉచ్చుకు బలైన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కు ఘన నివాళి   •   విద్యార్థులు కళావేదికను సద్వినియోగం చేసుకొని ఉన్నతులుగా ఎదగాలి   •   విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి   •   బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీసీపీ భాస్కర్   •   ఖబర్దార్ కౌశిక్ రెడ్డి.. పొంగులేటి సైన్యం ఊరుకోదు   •   పశువుల దొంగలు అరెస్టు   •   శ్రీ మహంకాళి సమేత బ్రహ్మసూత్ర నీలకంఠ స్వామి ఆలయంలో వైభవంగా కళ్యాణ మహోత్సవం   •  

భూ వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం

14-08-2026 09:06 PM

సరైన ఆధారాలు చూపించే వరకు ఇరువర్గాలు ఆ భూమి లోకి వెళ్ళరాదు

తాసిల్దార్ గడ్డం ఉమారాణి

ఆళ్లపల్లి,(విజయక్రాంతి): దళితులకు 1977వ సంవత్సరంలో 20 కుటుంబాలకు రెండు గుంటల చొప్పున ఇంటి నిర్మాణాలకు కేటాయించారని ఆ భూమి ఆక్రమనకు గురైందని దళిత కుటుంబాలు రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తాహసిల్దార్ గడ్డం ఉమారాణి మాట్లాడుతూ. రెండెకరాల 20 గుంటల  భూమిని దళిత కుటుంబాలకు కేటాయించిన భూమి మండల కేంద్రానికి చెందిన కొందరు ఆక్రమించారని దళిత కుటుంబాలు ఆరోపిస్తూ తహసీల్ కార్యాలయాన్ని ఆశ్రయించడం జరిగిందని

ఇట్టి విషయమై ఇరువర్గాల వద్ద ఉన్న పత్రాలను, పూర్తిస్థాయిలో పరిశీలించేంతవరకు అట్టి భూమిలోకి ఇరు వర్గాల ప్రజలు వెళ్లవద్దని అట్టి భూమిలో ప్రభుత్వ బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఇట్టి విషయాన్ని ఆర్డీవో దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని  కనుక  వివాదాస్పదమైన భూమిని ప్రభుత్వ ఆధీనంలోకీ తీసుకుని ప్రభుత్వ బోర్డును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కనుక ఇరువర్గాలు పూర్తిస్థాయిలో సర్వే చేసి సరైన ఆధారాలను పరిశీలించేంతవరకు సంయమనం పాటించాలని సూచించారు.