18 April, 2026 | 11:08 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

Delhi Liquor Policy Case: లిక్కర్ స్కాంలో కవితకు క్లీన్ చిట్

27-02-2026 11:59 AM

లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్.

ఇచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు.

ఐదు నెలల పాటు జైల్లో ఉన్న కవిత.

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో(Delhi liquor policy case) కల్వకుంట్ల కవితకు(Kalvakuntla Kavitha) భారీ ఊరట లభించింది. కవితతో పాటు ఆడిటర్ బుచ్చి బాబుతో సహా ఇతర నిందితులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(Central Bureau of Investigation) నమోదు చేసిన కేసులను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఆప్ నాయకులు మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఇతర నిందితులపై సీబీఐ దాఖలు చేసిన కేసును కూడా కోర్టు కొట్టివేసింది. రెండు వైపుల నుండి వివరణాత్మక వాదనలు విన్న తర్వాత ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.

తన ఉత్తర్వులో, కోర్టు సీబీఐపై తీవ్ర విమర్శలు చేసింది. కేసు నమోదు, దర్యాప్తు విధానాన్ని తీవ్రంగా విమర్శించింది. ప్రక్రియలో తీవ్రమైన లోపాలను గమనించిన కోర్టు, కేసు నమోదు  దర్యాప్తు నిర్వహణ రెండింటిలోనూ ఏజెన్సీ విధానాన్ని తప్పుబట్టింది. చివరికి నిందితులందరిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal), సిసోడియాతో పాటు కవితకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆధారాలు లేకుండా ఇరికించారని సీబీఐపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 23 మంది తప్పు చేశారని సాక్ష్యాధారాలు లేవన్న కోర్టు స్పష్టం చేసింది.  లిక్కర్ కేసులో కవిత ఐదు నెలల పాటు జైల్లో ఉన్న విషయం తెలిసిందే.