calender_icon.png 18 February, 2026 | 3:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిశుభ్రతకు పెద్దపీట వేయాలి

18-02-2026 12:00:00 AM

  1. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు 
  2. కమిషనర్లు, జోనల్ కమిషనర్లు పొద్దున్నే ఫీల్డ్‌లోకి వెళ్లాలి
  3. పురపాలక శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి) : మూడు నగర పాలక సంస్థల పరి ధిలో పరిశుభ్రతకు పెద్ద పీట వేయాలని సీఎం  రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తాను ప్రత్యక్ష పరిశీలనకు వస్తానని.. ఎక్కడైనా చెత్త కనపడితే సహించమని అధికారులను సీఎం హెచ్చరించారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి నగర పాల క సంస్థల కమిషనర్లు తెల్లవారుజామున 6 గంటలకే క్షేత్ర పర్యటనలు చేయాలని సీఎం ఆదేశించారు.

పురపాలక, పట్టణాభివద్ధి శాఖలపై సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర సచివాలయం లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రకటనల ఆదాయం పెంపు పాలసీపై ముఖ్యమంత్రి సమీక్షించారు. జీహెచ్‌ఎంసీ విభజన తలెత్తిన పలు సమస్య పరిష్కారానికి సీఎం రేవంత్‌రెడ్డి పలు సూచనలు చేశారు. ‘మూడు కార్పొరేషన్లలో శానిటేషన్ పైన ప్రత్యేక దృష్టి సారించాలి. త్వరలో ప్రతి జోన్‌లో పర్యటిస్తా. రోడ్లు శుభ్రం లేకపోతే అక్కడిక్కడే అధికారులను అక్కడికక్కడనే సస్పెండ్ చేస్తా. 

చాలా మంది అధికారులు ఫీల్డ్‌లోకి వెళ్లడం లేదు. ఇక నుంచి  కమిషనర్లు, జోనల్ కమిషనర్ లు పొద్దునే ఫీల్డ్ లో ఉండాలి. అన్ని పార్క్ ల వివరాలు సేకరించాలి. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించా లని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఆదా యం పెంపునకు తీసుకోవాల్సిన పలు అం శాలపై అధికారులకు సీఎం సూచనలు ఇచ్చారు. నగరంలో కూడళ్లు, ఇతర ప్రాం తాల్లో స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎలక్ట్రిక్, ఇతర కేబుళ్లు, సీసీ కెమె రాలు, ప్రకటనల బోర్డులు వాటిపై ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం ఆదేశించారు.

ప్రకటనలకు సంబంధించి పెద్ద మొత్తంలో వివిధ రకాల బోర్డులు కనిపిస్తున్నా ఆశించిన ఆదాయం ఎందుకు రావడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ప్రశ్నించారు. ముంబయి, అహ్మదా బాద్, బెంగళూర్ల్లోని ప్రకటనల ఆదాయంతో నగరంలో వస్తున్న ఆదాయాన్ని పరిశీలించాలన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే లా వ్యవహరిస్తున్న ప్రకటనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు.  ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రకటనలకు 10 శాతం బోర్డులు కేటా యించాలని సీఎం సూచించారు.

ఈ సందర్భంగా పీపీపీ, ఇతర నమూనాల్లో ఆదా యం సమకూర్చుకునే అంశంపై అధికారులు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చా రు. దానిని పరిశీలించిన ముఖ్యమంత్రి పలు సూచనలు, సలహాలు అందజేశారు. మూడు నగర పాలక సంస్థలతో పాటు రాష్ర్టంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో వీధి దీపాల నిర్వహణ విషయంలో యూనికోడ్ సిస్టమ్ అనుసరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  రు.

డాటా సెంటర్లకు రాయితీలపై అధ్యయనం చేయండి

డాటా సెంటర్లకు వివిధ రాష్ట్రాలు ఇస్తున్న రాయితీలపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ర్టంలో డాటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంస్థలు.. వారికి అవసరమైన భూమి, ఇతర వసతులపై రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. డాటా సెంటర్లకు భూ కేటాయింపులో హేతుబద్ధత ఉండాలని సీఎం సూచించారు.

వివిధ ప్రాంతాల్లో డాటా సెంటర్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు సాగుతున్న భూ సేకరణపైనా అధికారులను సీఎం ఆరా తీశారు. భూ పరిహారం నిర్ణయం విషయంలో ఉదారంగా ఉండాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రైతులను పిలిచి మాట్లాడి వారు సంతృప్తి చెందేలా పరిహారం నిర్ణయించాలన్నారు. సమీక్షలో సీఎస్ రామకష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.

కొత్తగా ఎన్నికైన వారికి ఒక రోజు శిక్షణ

రాష్ర్టంలో కొత్తగా ఎన్నికైన మేయ ర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, డిప్యూ టీ ఛైర్మన్లతో త్వరలోనే ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదే శించారు. నగరాలు, పట్టణాల అభివద్దికి తీసుకోవాల్సిన చర్యలు.. ఇతర అంశాలను వివరించాలని సూచించారు.

తాను సమావేశానికి హాజరై నూత నంగా ఎన్నికైన వారితో మాట్లాడాతానని సీఎం తెలిపారు. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకష్ణారావు, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిష నర్లు ఆర్వీ కర్ణన్, సజన, వినయకృష్ణారెడ్డి పాల్గొన్నారు.