ఇందిరమ్మ ఇండ్ల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్
- ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’లో స్పెషల్ డ్రైవ్
- 2,764 మంది లబ్ధిదారులకు ప్రయోజనం
- హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వీపీ గౌతం
హైదరాబాద్, మార్చి 14 (విజయక్రాంతి) : ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా హౌసింగ్ కార్పొరేషన్‌లో ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల క్లియరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గత వారం రోజుల్లో 2,764 మంది లబ్ధిదారులకు సంబంధించి సుమా రు రూ.28.50 కోట్ల పెండింగ్ బిల్లులను క్లియర్ చేశామని చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వీపీ గౌతం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రతి విభాగంలోనూ చేపట్టాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 99 రోజుల కార్యక్రమంలో, వివిధ కారణాలతోఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల బిల్లుల విడుదలలో జాప్యం జరుగుతున్న అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్ఫష్టంగా నిర్దేశించారు. దీంతో 99 రోజుల కార్యక్రమం మొదటి వారం రో జుల్లో ఇందిరమ్మ ఇండ్ల పెండింగ్ బిల్లులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఆయా ఇండ్ల నిర్మాణ పురోగతిని అనుససరించి విడతల వారీగా బిల్లులను నేరుగా వారి ఖాతాల్లో జ మ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే లబ్ధిదారుల ఆధార్ నెంబర్ బ్యాంక్ అకౌంట్‌లకు అనుసంధానించకపోవడం, వారి పేర్లలో తేడాలు ఉండటం, ఆన్ లైన్‌లో అప్ లోడ్ చేసిన ఫోటోలు సరిగా లేకపోవ డం, ఏఐ పరిశీలనలో అభ్యంతరాలు రావడంతోపాటు, గత పథకాల్లో లబ్ది పొంది ఉండటం, ఎల్-3 కేటగిరి నుంచి ఎల్-1 కేటగిరీ జాబితాల్లోకి వచ్చిన వారి వివరాల పరిశీలన, పలు కారణాలతో లబ్ధిదారులకు బిల్లుల విడుదలలో ఆలస్యం అనివార్యమవుతున్నది.
ఈ నేపథ్యంలో ప్రజా ప్రాలన ప్రగతి ప్రణా ళికలో మొదటి వారం రోజుల పాటు పెండింగ్‌లో ఉన్న బిల్లులను ను క్లియర్ చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని వీపీ గౌతం తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులపై ప్రత్యేక దృష్టి సారించి నిశితంగా పరిశీలించి క్లియర్ చేశామని ఆయన వివరించారు.
వారం రోజుల్లో క్లియర్ చేసిన బిల్లులలో ఎల్-3 జాబితాలో ఉన్న 1200 మందికి సంబంధించి రూ.12.06 కోట్ల విడుదల, బిల్లులు విడుదలైనప్పటికీ వివిధ కారణాలతో బ్యాంక్ వద్ద పేమంట్ ఫెయిల్ 653 మంది లబ్ధిదారులకు చెందిన రూ. 7 కోట్ల మేర మొత్తాన్ని విడు దల చేసినట్లు పేర్కొన్నారు. వీటితో పాటు పలు అభ్యంతరాలు, నిశిత పరిశీలన నిమిత్తం పెండింగ్‌లో ఉన్న మరో 911 మంది లబ్ధిదారులకు రూ.9.40 కోట్లను కూడా విడుదల చేసేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.




