29 June, 2026 | 10:05 PM

Breaking News

కార్మిక సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు: కె. సారయ్య   •   జర్నలిస్టుల ముందస్తు అరెస్టులు ఖండనీయం : కొర్ర శ్రీను నాయక్   •   హనుమంతులపాడులో ఘనంగా గంగమ్మ తల్లి బోనాల ఉత్సవాలు   •   ఏరువాక పౌర్ణమి సందర్భంగా శ్రీ గురు పీఠంలో ప్రత్యేక పూజలు   •   ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా ట్యాంకుల నిర్మాణం   •   నకిలీ విత్తనాలు, పురుగుమందులను అరికట్టాలి   •   బోడుప్పల్–చెంగిచెర్ల రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలి   •   ప్రతి గ్రామ సంఘంలో మూడు రకాల సంఘాలు చేయాలి   •   జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది   •   మత మార్పిడి ప్రయత్నాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి   •  

కోదాడలో కల్తీ వంట నూనె

15-03-2026 02:08 AM

స్వాధీనం చేసుకున్న పోలీసులు

కోదాడ, మార్చి 14 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కల్తీ వంట నూనె దం దా వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ట్యాంకర్లలో కల్తీ వంట నూనెను తీసుకొచ్చి కోదాడలో బ్రాండెడ్ కంపెనీ ఖాళీ డబ్బాల్లో నింపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ కల్తీ నూనెను కొంతమంది స్థానిక వ్యాపారులు కొనుగోలు చేసి పట్టణంలోని పలు కిరాణా దుకాణాలు, హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం.

ఆ నూనెనే వినియోగదారులకు అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చె లగాటం ఆడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైవే పక్కన ట్యాంకర్ నుంచి కల్తీ నూనెను అన్‌లోడ్ చేస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ ఘటనపై టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు సంఘట నా స్థలానికి చేరుకుని నూనె శాంపిల్స్ సేకరించి ప రిశీలన కోసం పంపించారు. ఇంత జరుగుతున్నా కోదాడలో కల్తీ వంట నూనె దందా మాత్రం ఆగ డం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.