హామ్మయ్య రైల్వే గేట్ తెరిచారు!
11-06-2025 11:27 AM
మహబూబాబాద్,(విజయక్రాంతి): కాజీపేట-డోర్నకల్ జంక్షన్ల(Kazipet-Dornakal junction) మధ్య మూడవ రైల్వే ట్రాక్ నిర్మాణం కోసం కొద్ది కాలం క్రితం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మూసివేసిన రైల్వే గేట్ ను పునః ప్రారంభించారు. గేటు మూసివేత వల్ల పట్టణానికి ఇరువైపులా ఉన్న ప్రజలు, వాహన దారులు రైల్వే ట్రాక్ దాటేందుకు దూరంగా ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్, తేలికపాటి వాహనాలు అండర్ బ్రిడ్జి ద్వారా వెళ్లాల్సి వచ్చేది. గేటు తిరిగి తెరవడంతో బస్టాండ్ వైపు నుంచి తాహసిల్దార్ ఆఫీస్ వైపు వెళ్లే వారికి దూర భారం తప్పింది.






