బీఆర్కే భవన్‌కు చేరుకున్న కేసీఆర్
హైదరాబాద్: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో(Kaleshwaram Lift Irrigation Project) జరిగిన అవకతవకలపై విచారణకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Kalvakuntla Chandrashekar Rao) బుధవారం బీఆర్కే భవన్ కు చేరుకున్నారు. ఉదయం 11:30 గంటలకు హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. కమిషన్ ఆఫీస్ కు కేసీఆర్ తో పాటు 9 మందికి మాత్రమే అనుమతి లభించింది. ఆయన వెంట హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, పద్మారావుగౌడ్, మహమూద్ అలీ, రవిచంద్ర, మధుసూదనాచారి, లక్ష్మారెడ్డి, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఉన్నారు. కేసీఆర్ విచారణ నేపధ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్కే భవన్ దగ్గరకు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బీఆర్కే భవన్ను అష్ట దిగ్బంధనం చేశారు.






