calender_icon.png 12 November, 2025 | 8:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో బట్టల దుకాణం దగ్ధం

12-11-2025 07:27:24 PM

రూ 10 లక్షలు నష్టం..

తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్కుట్ తో లిమ్రా కిడ్స్ వేర్స్, రెడీమెంట్ బట్టల దుకాణంలో మంటలు అంటుకున్నాయి. మంటల్లో దాదాపు పదిలక్షల రూపాయల విలువైన బట్టలు కాలి బూడిద అయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న ఫైట్ సిబ్బంది మంటలు ఆర్పారు. అయితే ప్రభుత్వం తనను ఆదుకోవాలని దుకాణం యజమాని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.