12-11-2025 07:26:08 PM
మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్
హనుమకొండ,(విజయక్రాంతి): కాకతీయ విశ్వవిద్యాలయం ఎస్డీఎల్సీ ప్రాంగణంలో తలపెట్టిన బీసీల ధర్మ పోరాట దీక్షకు (MEPA) మెపా ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ అన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలోనే బీసీ జనాభాలో ముదిరాజుల అత్యధికంగా ఉన్నారని, బీసీ ఉద్యమంలో కూడా ముదిరాజ్ లు ముందు వరుసలోకి రావాలని, ఈ దీక్ష శిబిరాన్ని నిర్వహిస్తున్న అరగంటి నాగరాజ్ గౌడ్ ను అభినందించారు. బీసీ 42 శాతం రిజర్వేషన్ కోసం ఉద్యమానికి సిద్ధమని ప్రభుత్వం బీసీలకు సముచిత స్థానం కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమ దీక్షను శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ స్పీకర్ మధు సూదనాచారి విరమించడం అభినందనీయమని అన్నారు.