తెలుగు మహాసభలకు సీఎల్పీ ఉద్యోగి
21-05-2026 12:00 AM
హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి) : జూన్ 6, 7 తేదీల్లో రాజమహేంద్రవరంలో జరిగే 7వ ప్రపంచ తెలుగు మహాసభలకు అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న శ్రీపాద శ్రీనివాస్‌కు ఆహ్వానం అందింది. 24 ఏళ్లుగా సీఎల్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూనే.. రచనా వ్యాసాంగాన్ని ప్రవృత్తి ఎంచుకుని రాజకీయ, సామాజిక చైతన్యంతో శ్రీపాద శ్రీనివాస్ ఎన్నో కథలు రాశారు. అంతే కాకుండా ఆకాశాణి హైదరాబాద్ కేంద్రం ద్వారా ‘ గుండె చప్పుళ్లు, అంతరంగం, గోదావరి ఆలలలో అమ్మ పిలుపు, నీరిక్షణ ’ లాంటి కవితలు కూడా రాశారు. చైతన్య సారస్వత పరిషత్ సౌజన్యంతో అంతర్జాతీయ సాహిత్య సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.






