అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టులకు వయస్సు సడలింపు
21-05-2026 12:00 AM
హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి): గరిష్ఠ వయోపరిమితిని 34 నుంచి 44 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఏప్రిల్ 20వ తేదీన జారీ చేసిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-2) పోస్టులకు వయోపరిమితి సడలింపు వర్తించనున్నట్లు తెలిపింది. అదేవిధంగా ఈ పరీక్షను తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో నిర్వహించనున్నట్లు మరో ప్రకటనలో పేర్కొంది.






