ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా ఉండాలి
11 జిల్లాలకు భారీ వర్ష సూచనతో.. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్
శాంతికుమారి టెలీకాన్ఫరెన్స్
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలోని 11 జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో.. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహిం చారు. భారీ వర్ష సూచనలున్న ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ సూచించారు.
ముందస్తు ప్రణాళికతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం కలగకుండా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించే విషయం జిల్లా కలెక్టర్లే నిర్ణయం తీసుకోవాలన్నారు. స్వర్ణ, కడెం ప్రాజెక్టుల గేట్లను తెరవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాని నిర్మల్ కలెక్టర్‌ను ఆదేశిం చారు. నిర్మల్‌కు నాలుగు బోట్లు, 31 మంది సభ్యులతో కూడిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాన్ని పంపుతున్నట్లు చెప్పారు. ఎస్‌ఆర్‌ఎస్‌పీ ప్రాజె క్టు నుంచి 20 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని, ఈ నీటి పరిమాణం ఎక్కువైతే.. పరీవాహక ప్రాంతాల్లో ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
మహారాష్ట్ర నుంచి వచ్చే నీటి పరిమాణాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా అక్కడి అధికారులతో సమన్వ యంగా ఉండాలన్నారు. డీజేపీ జితేందర్ మా ట్లాడుతూ.. భారీ వర్ష సూచన ఉన్న జిల్లాలో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకోవడానికి క్రేన్‌లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచిం చారు. విపత్తుల నిర్వహణ శాఖ ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, ఫైర్ సర్వీసుల డీజీ నాగిరెడ్డి, నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ పాల్గొన్నారు.






