08-11-2025 08:17:10 PM
మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విఠల్ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ
పాపన్నపేట (విజయక్రాంతి): పాపన్నపేటలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కుమ్మరి విట్టల్ ఆధ్వర్యంలో స్థానిక సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం పాపన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ యూత్ నాయకులు మధుసుధన్ రెడ్డి, నాగరాజు, ఇస్సాక్, జకారియా, సలీం, సత్యానందం తదితరులు పాల్గొన్నారు.