calender_icon.png 8 November, 2025 | 9:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజువల్ ఆర్ట్స్ విభాగంలో నేషనల్ కి సెలెక్ట్ అయిన ఏకలవ్య పాఠశాల విద్యార్థి

08-11-2025 08:17:37 PM

టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి మండలం బద్దుతండాలో ఉన్నటువంటి ఏకలవ్య మోడల్ పాఠశాలలో 9వ తరగతి చదువుకుంటున్న నారపోగు హర్ష వీణ  విజువల్ ఆర్ట్స్  విభాగంలో నేషనల్ కు సెలెక్ట్  ఐంది. మండలంలోని పాత తడికలపూడి గ్రామానికి చెందిన నారపోగు హర్ష వీణ  కడు పేదరికంలో  ఉంటూ  2022లో ఏకలవ్య మోడల్ స్కూల్ లో ఆరవ తరగతి లో సీటు సంపాదించింది. ఇప్పుడు బద్ద తండాలో ఉన్నటువంటి ఏకలవ్య స్కూల్లో 9వ తరగతి చదువుకుంటుంది.

చిన్నప్పటినుండి బొమ్మలు తయారుచేయడంలో ఆసక్తి చూపిన హర్ష వీణ అక్టోబర్ 16 17 18 తేదీలలో నిజాంబాద్ జిల్లా గాంధారిలో ఉన్నటువంటి ఏకలవ్య మోడల్ స్కూల్ లో పాటిస్పేట్ చేసి స్టేట్ సెకండ్ స్థానం సంపాదించింది. వారి స్కూలుకు వాళ్ల గురువులకు వాళ్ల తల్లిదండ్రులకు మంచి పేరు సంపాదించింది ఇప్పుడు నవంబర్ 8వ తారీకు నాడు నేషనల్ కు సెలెక్ట్ అయ్యారు. నేషనల్ స్థానంలో కూడా ఫస్ట్ స్థానం సంపాదించి వారి స్కూలుకు వాళ్ల గురువులకు తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి పెట్టాలని అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు తెలంగాణ స్టేట్ కు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నారు.