calender_icon.png 8 November, 2025 | 9:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుర్వపల్లి ప్రజా గోస తీర్చండి

08-11-2025 08:14:45 PM

జడ్చర్ల: మండల పరిధిలోని కుర్వపల్లీ గ్రామంలో ఈద్దుల చెరువు నిండి ప్రవహించే కాల్వను అక్రమంగా మూసివేయడం వలన పెద్ద వర్షం వొచ్చినప్పుడు ఆ చెర్వు నీరు కుర్వపల్లీ గ్రామాన్ని ముంచివేస్తుందని, ఇట్టి విషయం కలెక్టర్ కు ప్రజావాణి రోజు దరఖాస్తు ఇచ్చినా అధికారులు పట్టించుకోవటం లేదని బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్ కొంగలీ శ్రీకాంత్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యేకి చెప్పిన కూడా గ్రామం సమస్య తీరడం లేదని గ్రామ ప్రజలు  కొంగలీ శ్రీకాంత్ కుల సంఘం నాయకులు తెలిపారు. దీంతో పాటు తప్పట్టి శ్యామ్, లక్ష్మణ్, నర్సిములు గ తో కుర్వపల్లీ గ్రామంలో తిరిగి ప్రజా సమస్యలు  తెలుసుకున్నారు. ఈ సమస్య ను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామం నాయకులు లింగం,వేణు, ఆంజనేయులు, మహేష్, కుర్మయ్య, శ్రీశైలం, వెంకటయ్య, చిన్నయ పాల్గొన్నారు.