హరీశ్ రావుపై సీఎం వ్యాఖ్యలు అర్థరహితం
ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి
గజ్వేల్, జూన్ 7: సిద్దిపేటలో రఘునందన్ రావుకు మాజీ మంత్రి హరీశ్‌రావు ఓట్లు వేయించి గెలిపిస్తే, ఈటల రాజేందర్, డీకే అరుణను సీఎం రేవంత్‌రెడ్డి గెలిపించారా అని ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఉండి హరీశ్ రావు బీఆర్‌ఎస్ ఓట్లు బీజేపీకి వేయించారంటూ మాట్లాడడం సిగ్గుచేటన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో తమ గళాలను విప్పి తెలంగాణ సమస్యలపై మాట్లాడలేరని, ఆంధ్రాలో టీడీపీ గెలిచినట్లుగా, తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎంపీ లు గెలిస్తే బీజేపీ ప్రభుత్వ మెడలు వంచి సమస్యలను పరిష్కరించుకునే వాళ్లమన్నారు. తెలం గాణ కోసమే బీఆర్‌ఎస్ పార్టీ పుట్టిందని, రాష్ట్రా న్ని అభివృద్ధి చేసేది.. అవినీతి లేకుండా పథకాలను అందించేది కేవలం బీఆర్‌ఎస్ పార్టీ మా త్రమేనన్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లలో నీటిని నింపి రైతులకు సాగునీరందించాలని డిమాండ్ చేశారు.






