26 June, 2026 | 1:46 AM

సీఎం సహాయనిధి నిరుపేదలకు వరం

26-06-2026 12:00 AM

హనుమకొండ, జూన్ 25(విజయ క్రాంతి): అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి గొప్ప వరమని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పలువురు లబ్ధిదారులకు మంజూరైన రూ.3,50,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను కనకదుర్గ కాలనీలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో  గురువారం ఎంపీ కడియం కావ్య స్వయంగా అందజేశారు. ఎంపీ మాట్లాడుతూ  ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.