26 June, 2026 | 1:46 AM

సీఎంఆర్‌ఎఫ్ పేదప్రజలకు గొప్ప వరం

26-06-2026 12:00 AM

శేర్‌లింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

కూకట్‌పల్లి, జూన్ 25 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు గొప్ప వరమని పీఏసీ చైర్మన్, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరెకెపూడి గాంధీ అన్నారు. గురువారం ఆయన ఇంటి వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 43, లక్షల,7,500/- రూపాయల చెక్కులను 58 మంది బాధిత కుటుంబాలకు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని, ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటుందన్నారు. అనారోగ్యానికి గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు, అభాగ్యులకు అండగా సీఎం సహాయనిధి నిలుస్తుందన్నారు. 

ఈ సందర్భంగా వైద్య చికిత్సకు సహాయాన్ని అందించిన పిఎసి చైర్మన్ అరెకపూడి  గాంధీ కి బాధిత కుటుంబాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజ్, నాయకులు సంజీవరెడ్డి, రఘునందన్ రెడ్డి, నాయినేని చంద్రకాంతరావు, ఎండి ఇబ్రహీం, మంత్రి ప్రగడ సత్యనారాయణ, చిరుముర్తి రాజు, మల్లయ్య, గోపాల్, తిరుపతి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.