8 May, 2026 | 4:22 PM

Breaking News

టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్.. విజయ్‌కు వామపక్షాల మద్దతు   •   అనారోగ్యం బారిన పడిన విలేఖరి కుటుంబానికి సీఎం సహాయ నిధి అందజేత   •   పశువుల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ పనికిరాదు   •   స్వీయ జనగణనపై అవగాహన   •   ఉపాధి హామీ పనుల్లో కార్మికుల సంఖ్య పెంచాలి   •   జనాభా గణనలో పాల్గొనడం ప్రతి ఒక్కరి బాధ్యత   •   ఇంటర్మీడియట్ సప్లమెంటరీ అడ్వాన్స్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి..   •   ఇబ్రహీంపేట్ లో అంబలి కేంద్రం, చలివేంద్రం ప్రారంభం   •   మొండికుంట రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రేగా కాంతారావు   •   పశువులలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం ప్రారంభం   •  

అనారోగ్యం బారిన పడిన విలేఖరి కుటుంబానికి సీఎం సహాయ నిధి అందజేత

08-05-2026 03:40 PM

బోథ్, (విజయ క్రాంతి): బజారత్నూర్ మండల కేంద్రం నకు చెందిన మాజీ విలేఖరి వెంకటేష్ గత ఏడాదికాలంగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. దీంతో ఆర్థిక ఇబ్బందుల్లోకి కురుకు పోయిన ఈయన కుటుంబాన్ని ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రీఛార్జ్ విభాగ్ రాష్ట్ర అధ్యక్షులు తుల అరుణ్ కుమార్ సీఎం సహాయ నిధి నుండి మంజూరి చేయించిన 60 వేల రూపాయల చెక్కును శుక్రవారం ఆయన కన్య ఇవ్వడం జరిగింది.

మానవతా దృక్పథంతో చెక్కును మంజూరు చేయించిన అరుణ్ కుమార్ కు స్థానిక ప్రింట్ మీడియా వారు కృతజ్ఞతలు తెలిపారు. మానవీయ కోణంలో ఆలోచించి తాను చెక్కును మంజూరు చేయించడం జరిగిందని అరుణ్ కుమార్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలుస్తుందని ఎన్నో కథనాలను రాసి మండల ప్రజల్లో పేరు ఉన్న విలేకరిని ఆదుకోవడం కోసం కృషి చేయడం అభినందనీయమని పలువురు పేర్కొంటున్నారు కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జల్కే పాండురంగ సిహెచ్ భూమయ్య బత్తిని కిషన్ సల్ల విట్టల్ విజయేందర్ తోపాటు పలువురు పాల్గొన్నారు