16 April, 2026 | 11:56 AM

Breaking News

కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •   జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కొత్త మహేష్   •  

సీఎం రేవంత్ జరా సునోజీ!

26-02-2026 12:20 AM
  1. నీరున్నా వినియోగించుకోలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం

ఉప కాలువలు నిర్మించి సాగునీరు అందించాలి

దుబ్బాక నియోజకవర్గ సాగునీటి సమీక్షలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి 

గజ్వెల్, ఫిబ్రవరి 25: కరువు కాటకాలకు నిలయమైన దుబ్బాక నియోజకవర్గం ఫై కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి వివక్ష చూపుతుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కెసిఆర్ హయాంలో కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టులు, ప్రధాన కాలువ లు నిర్మించుకొని సాగునీరు పారించుకున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెం డేళ్లు గడిచినా సాగునీటి ఫై ఉలుకు పలుకు లేదని విమర్శించారు.

దుబ్బాక నియోజకవర్గంలోని మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు పరిధిలో సాగునీటి సమస్యలఫై గజ్వెల్ లోని నీటిపారుదల శాఖ కార్యాలయం లో నీటిపారుదల, రెవెన్యూ శాఖ ల అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. దుబ్బాక నియోజకవర్గం కు మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్ట్ ల ద్వారా రామాయంపేట కాలువ, శంకరం పేట కాలువ, ఉప్పర్ పల్లి కాలువ, దుబ్బాక ప్రధాన కాలువల ద్వారా 10, 11, 12, 13 ప్యాకేజీ ల ద్వారా ప్రధాన కాలువలు తమ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేయడం జరిగిందని, ఉప కాలువలు పూర్తి కాకపోవడంతో పక్కన నీళ్లున్నా వినియోగించుకోలేని పరిస్థితి నెలకొందన్నారు.

రైతులు తామే స్వయంగా ప్రోక్లేయినర్ తో కాలువలు తవ్వుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉప కాలువలు పూర్తి అయితేనే నియో జకవర్గంలో 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. పాత రేట్ల కు రైతులు ఒప్పుకోవడం లేదని, కాలువలకు సంబంధించిన భూసేకరణ పూర్తి చేయాలన్నారు. ఉప కాలువలు పూర్తి చేసి నీటిని అంధించినప్పుడే పూర్తి స్థాయిలో న్యాయం చేసినట్లు అవుతుందన్నారు.

నియోజకవర్గ స్థాయిలో సాగునీటి వ్యవస్థ ఫై పూర్తి స్థాయిలో నివేదిక అందించాలని, సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి పనులు జరిగేలా చూస్తామని తెలిపారు.కార్యక్రమం లో గజ్వెల్, సిద్దిపేట నీటిపారుదల శాఖ ఎస్ ఈ లు సుధా కిరణ్, లక్ష్మణ్ లతో పాటు ఈఈ లు, డీఈ లు, ఏ ఈ ఈ లు, తహసీల్దార్ లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు..