16 August, 2026 | 2:49 PM

రేపటినుండి మండల కేంద్రంలోనే ప్రజావాణి

16-08-2026 01:58 PM

కల్లూరు,ఆగస్టు 16(విజయక్రాంతి): ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) ఆధ్వర్యంలో సోమవారం  నుంచి కల్లూరు రైతు వేదికలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.మండల స్థాయిలోని 23 ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించి,వారి సమస్యలకు పరిష్కార మార్గాలు చూపనున్నారు.ప్రజల నుంచి స్వీకరించిన వినతులను ప్రజావాణి పోర్టల్‌లో నమోదు చేయడంతో పాటు వాటిని జిల్లా కలెక్టర్,రాష్ట్ర స్థాయి అధికారులు పర్యవేక్షించనున్నారు.దీంతో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం దూరభారం, ప్రయాసతో జిల్లా కేంద్రంలోని ప్రజావాణికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మండల స్థాయిలోనే వినతులు సమర్పించే అవకాశం కలుగుతుందని ఎంపీడీఓ చంద్రశేఖర్ తెలిపారు.ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.