గాంధీభవన్‌కు రావొద్దు.. CM రేవంత్ కీలక ఆదేశాలు
- వంద మంది బీఎల్ఏలకు రాహుల్ తో ఫోటో దిగే అవకాశం
- సర్ పై జూమ్ సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
- ప్రతి ఒక్కరూ ఎస్‌ఐఆర్‌పై సీరియస్‌గా దృష్టి సారించాలి
హైదరాబాద్: SIR పై జూమ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్ఐఆర్ గడువును ఆగస్టు 3 వరకు పొండించారని సీఎం తెలిపారు.119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సర్ పై 489 భేటీలు జరిగాయని తెలిపారు. వెనుకబడిన నియోజకవర్గాల్లో ఇప్పటికైనా స్పందించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఛైర్మన్ పదవులు, పార్టీ పోస్టులు కావాలని గాంధీభవన్ చుట్టూ తిరగొద్దని తేల్చిచెప్పారు. పదవుల కోసం గాంధీభవన్ లో అపాయింట్ మెంట్లు ఇవ్వొద్దని సూచించారు. రేపటి నుంచి ఆగస్టు 3 వరకు నేతలు గాంధీభవన్ కు రావొద్దని స్పష్టం చేశారు.
కొందరు నేతలు హైదరాబాద్ లో కూర్చొని పనిచేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇన్ ఛార్జ్ మంత్రులు(In-charge Ministers) అన్ని జిల్లాల్లో సర్ పై సమీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఎంపీలు.. పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఇన్ ఛార్జ్ లు గా ఉన్న చోట ఎంపీలు పనిచేయకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. పార్టీ పరంగా సర్(Special Intensive Revision) ఇన్ ఛార్జ్ లుకా ఉన్న వారు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని సూచించారు. బీఎల్ వోల నివేదికల కంటే బీఎల్ఏల రిపోర్టులను పరిశీలించాలని ఆదేశించారు. బీఎల్ వోల రిపోర్టులపై(BLO Report) మాత్రమే ఆధారపడితే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. పార్టీ పరంగా పనిచేస్తున్న బీఎల్ఏలను నేతలు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలన్నారు.
పూర్తిగా క్షేత్రస్థాయిలో ఉండాలి.. హైదరాబాద్ చుట్టూ తిరుగుతామంటే కుదరదని ఫైర్ అయ్యారు. వచ్చే 10 రోజులు ఎన్నికల ప్రచారం తరహాలో నియోజకవర్గాల్లో పర్యటించాలని దిశానిర్దేశం చేశారు. సర్ కు నియమించిన పార్టీ ఇన్ చార్జ్ లు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే అన్నారు. బీఎల్ఏ, బీఎల్ వో రిపోర్టులను గాంధీభవన్ బృందం ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. సర్ ను ఇన్ ఛార్జ్ మంత్రులు పూర్తి పర్యవేక్షణ చేయాల్సిందేనని సూచించారు. ఈ నెల 30న మళ్లీ పూర్తిస్థాయి సమీక్ష నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. మరింత బాధ్యత తీసుకుని సమన్వయం చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ సర్ పై సీరియస్ గా దృష్టి సారించాలని పేర్కొన్నారు. SIR పైన బాగా పనిచేసే 100 మంది బీఎల్ఏలకు రాహుల్ గాంధీని కలిసి ఫోటో దిగే అవకాశం కల్పించాలని సీఎం వెల్లడించారు.






