డీఏవీ జాతీయ క్రీడా పోటీలకు విద్యార్థుల ఎంపిక
కాగజ్‌నగర్, ఆగస్టు 27 (విజయక్రాంతి): కాగజ్ నగర్ పట్టణంలోని డీ.ఏ.వి. లక్ష్మీపతి సింఘానియా పబ్లిక్ స్కూల్ విద్యార్థులు పలు క్రీడల్లో ప్రతిభ కనబరిచి జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల మీధానిలో నిర్వహించిన క్రీడా పోటీల్లో విద్యార్థులు విశేష ప్రతిభ చాటారు.హ్యాండ్‌బాల్ అండర్–14 బాలికల విభాగంలో విద్యార్థులు బంగారు పతకం సాధించగా, కరాటే అండర్–14 బాలికల విభాగంలో ఒక బంగారు, ఒక కాంస్య పతకం సాధించారు.
బాక్సింగ్ అండర్–14 విభాగంలోనూ జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అంబదాస్ రావు, పిఈటి బాలకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణమన్నారు.అక్టోబర్‌లో ఢిల్లీలో నిర్వహించనున్న డీ.ఏ.వి. జాతీయ క్రీడా పోటీల్లోనూ విద్యార్థులు ప్రతిభ చాటి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఎంపికైన క్రీడాకారులను పాఠశాల యాజమాన్యం, అధ్యాపక బృందం, అభినందించారు.






