24 June, 2026 | 2:44 PM

Breaking News

బుధవారంపేటలో సీసీ రోడ్డు పనుల ప్రారంభం   •   జోరుగా జీరోలో చల్లని పానీయ వ్యాపారం   •   అర్హులైన పేదలందరికీ ఇళ్లు   •   రాష్ట్రవ్యాప్తంగా వినిపించే ఒకే మాట.. 'కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ కావాలి'   •   'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •  

సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

01-02-2026 01:43 PM

* మెదక్-బొడ్మట్ పల్లి  రహదారిపై ఎల్లాపూర్ బీఆర్ఎస్ నేతల ధర్నా

* సిట్ విచారణ పేరిట మాజీ సీఎం‌ కేసీఆర్ కు నోటీసులు జారీ చేయడం సిగ్గుచేటు

* సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు

పాపన్నపేట: కేసీఆర్ పై సిట్ విచారణ చేయడం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమేనని బీఆర్ఎస్ పార్టీ ఎల్లాపూర్ అధ్యక్షులు పుట్టి సిద్దయ్య, యూత్ నాయకులు అజయ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సిట్ విచారణ పేరిట మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం పై మెదక్-బొడ్మట్పల్లి ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నాయకులు బైఠాయించి ధర్నా నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కి వ్యతిరేకంగా ‌నేతలు నినాదాలు చేసారు. రేవంత్ కు సీఎం సీటులో‌ కూర్చునే అర్హత లేదని, ఎన్నికల ముందు రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని ఆరోపించారు.

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం‌ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మంత్రివర్గంపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై సిట్ విచారణ జరపాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించినందుకు ఆరు గ్యారంటీల‌ పథకాలను అమలు చేయని ప్రభుత్వంపై సిట్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇట్టి ధర్నాలో మండల నాయకులు నిరూడి సత్యం, తాడేపు మహిపాల్, ఎల్లాపూర్ నాయకులు పట్నం శ్రీనివాస్, రమేష్, అమృతి, జైపాల్, గొల్ల శ్రీనివాస్, పుట్టి రవి, కిషన్, శ్రీనివాస్, నిరుడి రవి, నర్సిములు, అఖిల్, మాలేషం, సురేష్, కిష్టయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.