15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

అరుదైన గుండె శస్త్ర చికిత్సలకు నిలయం యశోద

01-02-2026 01:46 PM

యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పంకజ్ వినోద్

హనుమకొండ,(విజయక్రాంతి): యశోద హాస్పిటల్ లో అరుదైన గుండె శస్త్ర చికిత్సలు చేయడంలో నిష్ణాతులైన వైద్యులు ఉన్నారని,యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పంకజ్ వినోద్ అన్నారు. హనుమకొండలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డా.పంకజ్ వినోద్ మాట్లాడుతూ... యశోద హాస్పిటల్స్ మల్టీడిసిప్లినరీ హార్ట్ టీమ్ శస్త్రచికిత్స చేయడం అత్యంత ప్రమాదకరమని భావించిన పేసెంట్లకు మరియు గుండె నిర్మాణం క్లిష్టంగా ఉన్న వారికి కాంప్లెక్స్ ట్రాన్స్ కాథెటర్ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ ఆడ్వూన్స్డ్ కాంప్లెక్స్ కోరోనరీ యాంజియోప్లాస్ట్ ప్రక్రియలను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, ఈ మినిమల్లీ ఇన్వేసివ్, కాథెటర్ ఆధారిత చికిత్సలు ఎంపిక చేసిన పేసెంట్లకు సమర్థవంతమైన ఫలితాలను అందించడమే కాకుండా,త్వరగా కోలుకునేలా చేస్తాయన్నారు.

తీవ్రమైన అయోర్టిక్ వాల్వ్ వ్యాధి, అడ్వాన్స్డ్ కోరోనరీ ఆర్టరీ వ్యాధులు ముఖ్యంగా వృద్ధులలో మరియు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న పేసెంట్లలో హార్ట్ ఫెయిల్యూరకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని,ఇటువంటి పేసెంట్లకు సాధారణ ఓపెన్-హార్ట్ సర్జరీ చేయడం రిస్క్ తో కూడుకున్న పని అని, యశోద హాస్పిటల్స్ వంటి అనుభవజ్ఞులైన కేంద్రాలలో, ఇటువంటి అడ్వాన్స్ కాథెటర్ ఆధారిత చికిత్సలు సురక్షితమైన ప్రత్యామ్నాయాలుగా మారుతున్నాయన్నారు.ఈ ప్రక్రియలు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులు, కార్డియాక్ సర్జన్లు, ఇమేజింగ్ నిపుణులు మరియు క్రిటికల్ కేర్ నిపుణులతో కూడిన 'హార్ట్ టీమ్' ఆధ్వర్యంలో జరిగాయనీ,సిటి.స్కాన్, ఎకోకార్డియోగ్రఫీ మరియు ఐవియుఎస్ లేదా ఓసిటి వంటి ఇమేజింగ్ పరికరాల సహాయంతో వాల్వ్ అమరిక మరియు స్టంట్ వేయడం అత్యంత ఖచ్చితత్వం తో నిర్వహించామన్నారు. చాలా మంది పేషెంట్లు నేడు ఇతర ఆరోగ్య సమస్యల వల్ల సాధారణ సర్జరీ చేయించుకో లేని క్లిష్ట స్థితిలో ఉంటున్నారని, సరైన పేసెంట్ల ను ఎంపిక చేయడం, టీమ్ వర్క్ ద్వారా రిస్క్ తగ్గించి వారి రికవరీ ని మెరుగుపరుస్తున్నామని  తెలిపారు.