01-02-2026 01:40:44 PM
చండూరు,(విజయక్రాంతి): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ నేర్మట గ్రామ శాఖఆధ్వర్యంలో ఆదివారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష్యసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ, రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేసీఆర్‌పై అక్రమంగా కేసులు బనాయించి రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
నేర్మట గ్రామంలోని నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు నారపాక శంకర్, మాజీ సర్పంచ్ నందికొండ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సాగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నందికొండ వసంత ధనయ్య,బీ ఆర్ఎస్ నాయకులు బుర్కల శ్రీనివాస్ గౌడ్, నారపాక నరసింహ,నాగిళ్ళ శంకర్, కొంపల్లి శంకర్, గాలెంక కృష్ణయ్య, కడారి లింగస్వామి,చెనగోని శ్రీనివాస్, నారపాక యాదయ్య,ఈరటి లక్ష్మయ్య, బండమీది వేణు, కొంపల్లి అనిల్, నారపాక అనిల్,ఈర గట్ల యాదయ్య, బండమీది సత్తయ్య, నాగిళ్ల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.