10 June, 2026 | 2:29 PM

Breaking News

సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •   కల్వకుర్తి నియోజకవర్గానికి ‘ఫ్యూచర్ సిటీ’తో బంగారు భవిష్యత్తు   •  

తెలంగాణలో పెట్రోల్ కొరత.. సీఎం రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ మీటింగ్

25-03-2026 11:05 AM

పెట్రోల్, గ్యాస్ కొరతపై ముందస్తు జాగ్రత్తలు

హైదరాబాద్: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో తెలంగాణ(Telangana) రాష్ట్రంలో పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు (ఎల్‌పీజీ), యూరియా నిల్వలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) అత్యవసర ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు శాసనసభ కమిటీ హాలులో మంత్రులు, ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించనున్నారు. రాష్ట్రంలో ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా, అలాగే పెట్రోల్, గ్యాస్ కొరత తలెత్తకుండా నిల్వల నిర్వహణ, ముందస్తు జాగ్రత్తలపై ఈ సమావేశంలో  సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.