25 March, 2026 | 3:29 AM

సభ నడిపే తీరు ఇది కాదు

25-03-2026 01:54 AM
  1. టీ బ్రేక్ ఇచ్చి గంటలపాటు విరామం
  2. సీఎం ఢిల్లీ నుంచి వస్తున్నారని నాలుగు గంటలు సభ ఆపారు
  3. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేస్తున్నాం
  4. బీఆర్‌ఎస్ సభాపక్ష ఉపనేత హరీశ్‌రావు

హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): శాసనసభను నడిపే తీరు ఇది కాదని, శాసనసభ అంటే అధికారులకు లెక్క లేకుండా తయారైందని బీఆర్‌ఎస్ సభాపక్ష ఉపనేత హరీశ్‌రావు మండిపడ్డారు. బుధవారం పద్దులు ఉన్నాయని ఎజెండాలో పెట్టారని, ఇప్పటివరకు టూరిజం ఆరట్స్ అండ్ కల్చర్ పద్దుల బుక్కులు ఇంతవరకు రాలేదని, స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ బుక్స్, మైనార్టీ వెల్ఫేర్ పద్దులు ఇంతవరకు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

మీరు ఇప్పటిదాకా బుక్కులో వేయకపోతే మెంబర్స్ ఎప్పుడు చదువుకుంటారు.. పద్దుల మీద ఎట్లా మాట్లాడుతారని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి శాసనసభ అంటే పట్టింపు లేకుండా ఉంటే కరెక్ట్ కాదన్నారు. సభను నడిపే పద్ధతి ఇది కాదని ఉన్నత అధికారులకు చెప్పాలని స్పీకర్‌ను కోరారు. ఏ రోజు 10 గంటలకు ఉదయం సభ స్టార్ట్ కావడం లేదని, సీఎం ఢిల్లీ నుంచి రావాలని నాలుగు గంట లు సభను ఆపారని మండిపడ్డారు.

సీఎం మాట్లాడిన తర్వాత మా క్లారిఫికేషన్‌కు కూడా టైం ఇవ్వలేదని, మేం సభలో ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి ప్రిపేర్ అవుతున్నారు అని గంటన్నర ఆపారని, మీరు సమయపాలన పాటించకపోవడం, ఇప్పటివరకు పద్దులకు సంబంధించిన పుస్తకాలు రాకపోవడంపై తీవ్ర నిరసన తెలియజేస్తూ వాకౌట్ చేస్తున్నామని ప్రకటిం చారు. దీంతోపాటు మం డలిలో కూడా సభ నిర్వహణపై నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేస్తున్నట్టు మండలి బీఆర్‌ఎస్ సభాపక్ష నేత మధుసూదనాచారి ప్రకటించారు.