నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌కు వచ్చిందంటే.. హాలీవుడ్ వచ్చినట్లే
హైదరాబాద్: హైటెక్ సిటీలోని క్యాపిటాల్యాండ్ ఐటీపీహెచ్‌లో నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ గ్లోబల్ వీఎఫ్‌ఎక్స్(Netflix Eyeline Studios Global VFX), వర్చువల్ ప్రొడక్షన్ హబ్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తోంది, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అన్ని విధాలుగా సహకరిస్తోందని పేర్కొన్నారు.
నెట్‌ఫ్లిక్స్‌ను(Netflix) హైదరాబాద్ కు ఆహ్వానిస్తున్నామని సీఎం తెలిపారు. తనకు చిన్నప్పటి నుంచే సినిమాలు అంటే ఇష్టమన్నారు. చెన్నై నుంచి హైదరాబాద్ కు ఫిల్మ్ ఇండస్ట్రీని(Film Industry) తీసుకువచ్చారు. నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్ కు వచ్చిందంటే హాలీవుడ్ నగరానికి వచ్చినట్లే అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, సినీ నటుడు రానా దగ్గుబాటి పాల్గొన్నారు.




