calender_icon.png 6 December, 2024 | 5:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ పునర్నిర్మాణ సాధకుడు సీఎం రేవంత్ రెడ్డి

08-11-2024 06:14:29 PM

మణుగూరు: పదేళ్లు కేసీఆర్ కుటుంబ పాలనలో దగా పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం చేపట్టి, పేదల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డిదని పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శుక్రవారం మణుగూరు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.అనంతరం కేక్ కట్ చేసి కాంగ్రెస్ నాయకులకు తినిపించారు.

సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేందుకు నిరంతరం కృషి చేస్తున్న ఏకైక సీఎం రేవంత్ రెడ్డని పేర్కొన్నారు. ప్రతి పేదవాడికి ఆరు గ్యారెంటీలు అందెలా కృషి చేస్తున్నారన్నారు. రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని, ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 2 లక్షల రూపాయలను మాఫీ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినాకి నవీన్, సింగరేణి ఐ ఎన్ టి యు సి బ్రాంచ్ ఉపాధ్యక్షులు కృష్ణంరాజు, సెక్రెటరీ గట్టయ్య, మణుగూరు టౌన్ ప్రెసిడెంట్ శివ సైదులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.